Header Banner

పాకిస్తాన్ తో యుద్ధంపై భారత్ కీలక నిర్ణయం ? కాసేపట్లో ప్రకటన..!

  Sat May 10, 2025 17:54        India

పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్ గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా కొనసాగుతోంది. అదే సమయంలో పాకిస్తాన్ కూడా ఇవాళ మరో కౌంటర్ ఆపరేషన్ ప్రారంభించింది. దీన్ని భారత సేనలు దీటుగా తిప్పికొడుతున్నాయి. అయినా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. ముఖ్యంగా రాత్రి కాగానే భారత నగరాలపై పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్లు దూసుకువస్తున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు సైన్యం కూల్చేస్తోంది. అయినా దాడులు ఆగట్లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

భారత్ పై ఇకపై పాకిస్తాన్ చేసే అలాంటి దాడిని అయినా యుద్ధ చర్యగానే భావించాలని కేంద్రం ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఇకపై పాకిస్తాన్ నుంచి మన దేశంపై జరిగే దాడిని యుద్దంగా భావించి అందుకు తగ్గట్టుగా ప్రతిస్పందించాలని నిర్ణయించింది. దీనిపై ఇవాళ సాయంత్రం జరిగే విదేశాంగ, రక్షణశాఖల ఉమ్మడి ప్రెస్ మీట్ లో అధికారిక ప్రకటన చేయబోతున్నారు. తద్వారా ఇకపై పాక్ దాడి చేస్తే ఇక నేరుగా అసలు యుద్ధం మెదలుపెట్టేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది..

గత మూడు రాత్రులుగా పాకిస్తాన్ ఉత్తర భారతదేశంలోని సైనిక స్థావరాలు, పౌర ప్రాంతాలపై డ్రోన్, క్షిపణి దాడులను కొనసాగిస్తోంది. వాటిలో దాదాపు అన్నింటినీ బలమైన భారత వైమానిక రక్షణ నెట్‌వర్క్ అడ్డుకుంది. అయితే వీటిని ఇలాగే వదిలేస్తే దీర్ఘకాలం ఇలాంటి కవ్వింపు చర్యలు కొనసాగే ప్రమాదం ఉందని బావిస్తున్న కేంద్రం.. ఇకపై దాడికి దిగితే యుద్ధంగానే పరిణిస్తామని హెచ్చరికలు పంపబోతోంది.

పాకిస్తాన్ ప్రతీ రాత్రి చేస్తున్న డ్రోన్, మిసైల్ దాడులపై ఇవాళ త్రివిధ దళాధిపతులతో సమీక్ష నిర్వహించిన ప్రధాని మోడీ.. ఈ మేరకు వీటికి అడ్డుకట్ట వేసేందుకు తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా దాడులు కొనసాగితే మాత్రం పాకిస్తాన్ పై పూర్తి స్థాయి యుద్ధానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇవాళ సాయంత్రం రక్షణశాఖ ఓ ప్రకటన చేసే అవకాశముంది.

Read more at: https://telugu.oneindia.com/news/india/centre-to-consider-any-future-act-of-terror-by-pakistan-as-act-of-war-435903.html?ref_source=OI-TE&ref_medium=Home-Page&ref_campaign=News-Cards

ఇది కూడా చదవండి: వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! కొత్త రేషన్ కార్డ్ తీసుకోవడానికి ఇవే రూల్స్...!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!

 

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడువీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #IndiaVsPakistan #BreakingNews #WarAlert #NationalSecurity #IndianGovernment #DefenseDecision #BorderTensions